ఎయిర్పోర్ట్ లో గంజాయితో.. వ్యక్తి అరెస్ట్

HYD: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ ప్రయాణికుడు ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు మంగళవారం తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారీగా గంజాయి పట్టుబడటంతో ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.