నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

AP: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికసాయం అందించాలని సీఎం కోరారు. సాస్కి, పూర్వోదయ పథకం తరహాలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. అలాగే, ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాతోనూ సీఎం సమావేశం కానున్నారు.