సంతకు వచ్చిన ప్రజలకు అవగాహన

ASR: గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని, వాటికి దూరంగా ఉండాలని కొయ్యూరు సీఐ వెంకటరమణ, మంప ఎస్సై శంకరరావు తెలిపారు. ఆదివారం రాజేంద్రపాలెం వారపు సంతలో హెచ్‌సీ.అప్పారావు, పీసీ.సుబ్బు తదితరులతో కలిసి మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో సమావేశం నిర్వహించారు. గంజాయి వల్ల జీవితాలు నాశనమవుతాయన్నారు. అలాగే వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలన్నారు.