తిరువూరులో సీపీఎం నాయకుల నిరసన

NTR: తిరువూరులోని శాంతినగర్, అశోక్ నగర్, సుభాని కాలనీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీపీఎం డిమాండ్ చేసింది. 2014లో విధించిన నిషేధం కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి పేద, మధ్య తరగతి ప్రజలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.