ఎమ్మెల్యే చొరవతో గాయపడిన కార్మికులకు చెక్కులు
KRNL: కల్లూరు మండలం ఉలిందకొండలోని రిలయన్స్ బయోమాస్ కంపెనీలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో గాయపడిన ముగ్గురు కార్మికులకు నష్టపరిహారం అందజేశారు. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చొరవతో కంపెనీతో చర్చించి పరిహారం ఖరారు చేశారు. మాధవి నగర్ క్యాంపు కార్యాలయంలో వడ్డే చంద్ర మోహన్‌కు రూ.10 లక్షలు, సురేంద్రకు రూ.2 లక్షలు, బోయ మహేష్‌కు రూ.50 వేల చెక్కులను నిన్న అందించారు.