VIDEO: 'దోబీ ఘాట్ల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి'

VIDEO:  'దోబీ ఘాట్ల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి'

ప్రకాశం: హనుమంతునిపాడులో గతంలో టీడీపీ ప్రభుత్వం సర్వేనెంబర్ 52/1ఏలో ప్రభుత్వం 8.12 ఎకరాల భూమిని కేటాయించి, అందులో దోబీ ఘాట్లు నిర్మించింది. నీటి వసతి లేకపోవడంతో రజక వృత్తిని నమ్ముకున్న 90 కుటుంబాలు కొంతకాలంగా దోబీ ఘాట్లను వినియోగించలేదు. ఈ భూమిపై కొందరు ఆక్రమణదారుల కన్ను పడి, కంచెవేసి ఆక్రమించి స్మశాన భూమిగా మార్చారని వారు ఆవేదన చెందుతున్నారు.