కార్యకర్తలకు దీపిక పరామర్శ
సత్యసాయి: హిందూపురం YCP ఇంఛార్జ్ టీఎన్ దీపిక శనివారం పట్టణంలోని ఏఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన కరుబ గంగాధరప్ప, కిరికెర వెంకటేష్ భార్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.