రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనం, ఆటో ఎదురెదుగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.