అలర్ట్.. రానున్న 5 రోజులు జాగ్రత్త

అలర్ట్.. రానున్న 5 రోజులు జాగ్రత్త

PPM: జిల్లా ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని 15 మండలాల్లో హీట్ ఇండెక్స్ 41°C నుంచి 54°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగినన్ని నీళ్లు తాగుతూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు.