బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రామసుబ్బారెడ్డి
NDL: బేతంచెర్ల పట్టణంలోని పశువైద్యశాలలో ఇవాళ సహాయ సంచాలకులు డాక్టర్ రామసుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ మాధవిని డిప్యూటేషన్ మీద హుసేనాపురం పశువైద్యశాలకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. అనంతరం రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తన సేవలు అందజేస్తానని డాక్టర్ రామసుబ్బారెడ్డి తెలిపారు.