VIDEO: యువకుడు అనుమానాస్పద మృతి
TPT: తిరుపతి ఎస్‌టీవీ నగర్‌కు చెందిన దివాకర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం రాత్రి నుంచి కనిపించకపోయిన ఆయన మృతదేహం మంగళవారం ఉదయం కాలువలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం రుయా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.