నేడు జనగామలో చెక్క బొమ్మలాట

నేడు జనగామలో చెక్క బొమ్మలాట

JN: జనగామ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నర్మేట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కళాకారులు యక్షగానం, చెక్క బొమ్మలాటను శనివారం ప్రదర్శించనున్నారు. ప్రొఫెసర్ గూడూరు మనోజ్‌, శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ మెట్టు వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు.