జాతీయస్థాయి కరాటేలో నేలకొండపల్లి విద్యార్థి ప్రతిభ
KMM: జాతీయస్థాయి కరాటే పోటీల్లో నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరుకు చెందిన మైఖేల్ పాల్ సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటలో నిర్వహించిన 'ఇండియా ఓపెన్ ఫునాకోసి షోటాకన్ కరాటే ఛాంపియన్‌షిప్'లో ఈ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. సబ్ జూనియర్ బాలుర అండర్-25 కేజీల విభాగంలో మైఖేల్ పాల్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.