VIDEO: ఇసుక లారీ లను అడ్డుకున్న గ్రామస్తులు
MLG: వెంకటాపురం మండలం ఆలుబాకలో ఇవాళ గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. BDK జిల్లా చర్ల మండలం నుంచి వందల సంఖ్యలో వస్తున్న లారీలతో దుమ్ము ధూళి ఇళ్లలోకి చేరుతోందని.. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక లోడుతో వస్తున్న లారీలు బ్రిడ్జిలను ధ్వంసం చేస్తున్నాయని, రోడ్లపై గుంతలు ఏర్పడటంతో అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు తెలిపారు.