జీ7, నాటో దేశాలకు చైనా వార్నింగ్

జీ7, నాటో దేశాలకు చైనా వార్నింగ్

టారిఫ్‌లు పెంచాలని అమెరికా చేసిన ప్రతిపాదనలకు G7 దేశాలు మద్దతు తెలపడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధించడం అంటే.. ఏకపక్షంగా వేధింపులకు గురిచేయడమేనని చైనా అభిప్రాయపడింది. వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది. చైనా ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తే.. ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు చేసింది.