VIDEO: నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడుత నామినేషన్ల ప్రక్రియను ఆదివారం దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో ఎన్నికల అబ్జర్వర్, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయాదేవి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు చేపట్టిన ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ విధానం, భద్రతా చర్యలను పూర్తిగా పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా కొనసాగాలని సూచించారు.