ఆడిటోరియంను అందుబాటులోకి తీసుకురావాలి: కలెక్టర్
WNP: పట్టణ ఆడిటోరియంను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి దీనిని స్వాధీనం చేసుకుని, అవసరమైన కుర్చీలు, సౌండ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం ఈ కార్యక్రమంలో ఇంజినీర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డీఎస్పీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.