నేడు చించోడులో అవగాహన సదస్సు
RR: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) వారి ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగుపై రైతులకు నేడు ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చించోడు రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి నిషాంత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ సదస్సుకు జిల్లా అధికారులు, శాస్త్రవేత్తలు హాజరువుతున్నట్లు పేర్కొన్నారు.