'టీబీ సోకిన వారు వైద్యుల సూచనలు పాటించాలి'
VKB: ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి ప్రారంభించారు. DMGO డాక్టర్ స్వర్ణ కుమారి మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనల మేరకు పూర్తిస్థాయిలో చికిత్స పొంది వ్యాధిని నయం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ రవీంద్ర పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.