VIDEO: 'కన్నతల్లిని చంపిన తండ్రిని ఉరి తీయాలి'
SRPT: సూర్యాపేట ఇందిరమ్మ కాలనీలో పుష్పలత హత్యపై కుమారుడు ప్రశాంత్ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యాడు. అనుమానంతో తల్లిని వేధిస్తూ, బాధ్యత లేకుండా అప్పులు చేసి పారిపోయిన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. తాను బీటెక్ చదివి వైన్స్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, తన తల్లిని చంపిన ఆ క్రూరుడికి ఉరిశిక్ష వేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు.