మియాపూర్‌లో రోడ్డు, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు..!
RR: హైదర్‌నగర్ యూ-టర్న్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు రోడ్డు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొలగించారు. ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారిన అనధికారిక స్టాళ్లు, పార్కింగ్, వ్యాపార ఏర్పాట్లు స్థానిక ట్రాఫిక్ విభాగం పర్యవేక్షణలో తొలగించారు.