పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

KMR: బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు నల్ల సత్తయ్య తల్లి నల్ల బల్లవ్వ మృతి చెందగా, ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.