బాపులదొడ్డి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు

బాపులదొడ్డి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు

కర్నూలు: పెద్దకడబూరు మండలం బాపులదొడ్డి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయి కుమార్ అన్నారు . మంగళవారం బాపులదొడ్డి గ్రామ ప్రజల తాగునీటి కోసం వేసిన బోర్లను పరిశీలించారు. బాపులదొడ్డి, పీకలబెట్ట, హులికన్వి గ్రామాలలో తాగునీటి సౌకర్యం కోసం జలజీవన్ మిషన్ కింద రూ. 2.80 కోట్ల నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు.