కట్టలేరు వాగుకు వరద.. పోలీసుల ఆంక్షలు

NTR: గంపలగూడెం మండలం తోటమూల, వినగడప గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు శుక్రవారం వరద పోటెత్తింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీ గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో అటుగా వాహనాలను వెళ్లకుండా ఆంక్షలు విధించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.