పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
NGKL: వంగూర్ మండలం నిజాంబాద్ గ్రామంలో ఇవాళ పశువులకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. డాక్టర్ మల్లేశ్ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి నివారణకు రైతులు ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపిడి లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ దాసరి పరమేష్, వార్డు మెంబర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.