CMRF చెక్కులు అందజేసిన మంత్రి
BPT: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రేపల్లె టీడీపీ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 86 లక్షల విలువైన చెక్కులను, ఎల్‌ఓసీలను మంత్రి అనగాని పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.