VIDEO: మంజీరా నదిలో మునిగి యువకుడి మృతి
NZB: బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి చెందిన అంతేష్ (18) అనే యువకుడు మంజీరా నదిలో మునిగి మృతి చెందాడు. బుధవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కండ్‌గావ్ శివారులోని నదికి స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.