విద్యార్థిపై దాడి.. తీవ్ర గాయాలు
అన్నమయ్య: జిల్లాలో రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శాంతన్ రెడ్డిపై ఇవాళ కొందరు యువకులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు స్థానికుల తెలిపారు. అయితే వారి వివరాల మేరకు ఒక సంవత్సరం క్రితం జరిగిన గొడవ కారణంగా ఈ దాడి జరగినట్లు పేర్కొన్నారు. వెంటనే క్షతగాత్రుడిని 108లో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలినట్లు తెలియాజేశారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.