VIDEO: నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: కమిషనర్

TPT: వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ మౌర్య తెలిపారు. వినాయక సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరంలో వినాయక చవితి నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.