గన్నెలలో పర్యటించిన ఐటీడీఏ పీవో

గన్నెలలో పర్యటించిన ఐటీడీఏ పీవో

ASR: అరకు మండలం గన్నెల పంచాయతీలో బుధవారం పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పర్యటించారు. గన్నెల గ్రామంలో తాగునీటి ఇబ్బంది నెలకొందని స్థానికులు పీవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పీవో, గ్రామంలో తాగునీటి బావిని పరిశీలించారు. గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుద్ధమైన తాగునీరు అందేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.