VIDEO: భోగితో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

VIDEO: భోగితో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

CTR: పుంగనూరులో సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నిద్రలేచి ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. ఇళ్లలోని పాత వస్తువులను వీధిలోని ఇళ్ల ముందుకు తీసుకు వచ్చి భోగి మంటలు వేశారు. భోగి మంటల వద్ద పెద్దలు చిన్న పిల్లలు నిలబడి భగవంతున్ని స్మరిస్తూ భోగికి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.