ఆత్మహత్యకు పాల్పడిన సింగరేణి ఉద్యోగి మృతి
MNCL: మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన మెంగని శ్రీకాంత్ అనే సింగరేణి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు SI రాజశేఖర్ తెలిపారు. శ్రీకాంత్ దంపతులకు మనస్పర్ధలు చోటుచేసుకోవడంతో, పరస్పర అంగీకారంతో నెల క్రితం విడాకులు తీసుకున్నారు. దీంతో శ్రీకాంత్ మానసిక వేదనకు గురై గడ్డి మందు తాగడన్నారు.