VIDEO: 'బస్సు సౌకర్యం కల్పించండి'
కృష్ణా: తోట్లవల్లూరు(M) బొడ్డపాడు, చిన్నపులిపాక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని టీడీపీ కార్యకర్త సీఎం చంద్రబాబును కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ రెండు గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండేదని, రహదారి దెబ్బతినడం వల్ల ఈ సౌకర్యం నిలిపివేశారని తెలిపారు. ప్రభుత్వం రహదారులను మరమ్మతులు చేసిందని, ఇప్పుడు బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.