లివింగ్ విల్ అంటే ఏమిటి?
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో తనకు నయం చేయలేని వ్యాధి లేదా కోమా వంటి స్థితి వస్తే, కృత్రిమ వైద్యం వద్దని రాసి పెట్టుకునే పత్రమే 'లివింగ్ విల్'. ఇది కేవలం చికిత్సను నిలిపివేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తన ఇష్టపూర్వకంగా రాసే ఈ వ్రాతపూర్వక పత్రం ద్వారా గౌరవప్రదమైన మరణం పొందే హక్కు లభిస్తుంది.