VIDEO: కనకమహాలక్ష్మికి మార్గశిర పూజలు
VSP: విశాఖలోని ప్రముఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయం నుంచే వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం చేసుకున్నారు.