నూజివీడులో పోలీసుల రక్తదాన శిబిరం
ELR: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, నూజివీడులోని ఏరియా ఆసుపత్రిలో శనివారం డీఎస్పీ కేవీవీఎన్ వీ. ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానం అని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.