ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

PLD: వినుకొండలోని తిమ్మాయిపాలెం రోడ్డులోని చౌడమ్మ గుడి సమీపంలో గురువారం ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.