రేపే జాల్లపాలెం తిరునాళ్లు
ప్రకాశం: కొండపి మండలం జాల్లపాలెం గ్రామంలో గురువారం జరగనున్న తిరుణాల సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పార్కింగ్ సౌకర్యంతోపాటు ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు నిర్మించడం వంటి పనులు పూర్తి చేశారు. ఈ తిరునాళ్లకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.