'ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక పకడ్బందీగా నిర్వహించాలి'
SRCL: రెండవ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో గ్రామసభలు, మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించాలన్నారు.