17 పంచాయతీలకు ప్రత్యేక అధికారులు: ఎంపీడీవో
AKP: ఎలమంచిలి మండలంలో 17 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో కొండలరావు సోమవారం తెలిపారు. మూడు నుంచి నాలుగు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన వారిలో తనతో పాటు, తహసీల్దార్ కె. వరహాలు, డిప్యూటీ ఎంపీడీవోలు అనంతనాగ్, వి.దీపిక, మోహన్ రావు ఉన్నట్లు పేర్కొన్నారు.