'పోషకాహారంపై అవగాహన అవసరం'

'పోషకాహారంపై అవగాహన అవసరం'

VZM: పోషకాహారంపై అవగాహన అవసరమని మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అనూజ్ కుమార్ రాయ్ అన్నారు. గురువారం గజపతినగరం మండలంలోని కొనిసి గ్రామంలో పోషన్‌పై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణీలు తక్కువ ధరకు లభించే ఆకుకూరలు, జామ, రాగి వంటి వాటిని తీసుకోవాలని తెలిపారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ డి.శ్యామలత పాల్గొన్నారు.