జిల్లాలో ఎక్కడా యూరియా కోరత లేదు: కలెక్టర్

VZM: జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోమవారం స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 32 వేల మెట్రిక్ టన్నుల వరకు పంపిణీ చేశామని, మరో 3 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు.