వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,270 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 21,600 ధర పలకగా.. వండర్ హాట్ (WH) మిర్చి రూ. 35వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,500, ఎల్లో మిర్చి రూ. 21,500 పలికాయి. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.