నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల

NLG: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 588.40 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నిల్వ 312.50 టీఎంసులకుగాను, ప్రస్తుత నిల్వ 307.28 టీఎంసులుగా ఉంది. ప్రాజెక్టుకు 2.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 2.92 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లోతో 26 గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. అధికారులు పరివాహ ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.