నా కొడుకు మృతికి కారణం కేటీఆర్: గోపీనాథ్ తల్లి

నా కొడుకు మృతికి కారణం కేటీఆర్: గోపీనాథ్ తల్లి

TG: జూబ్లీహిల్స్ దివంగత MLA మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. 'నా కొడుకు మరణానికి కారణం మాజీమంత్రి KTR. మాగంటి చావుకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. మూడు రోజులు నా కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడు. కన్నతల్లి అయిన నన్ను కనీసం చూడనివ్వలేదు. కొడుకును కడసారి చూస్తానన్న KTR కనికరించలేదు. 90 ఏళ్ల వయసులో నాకు కడుపు కోత మిగిల్చారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.