'ధాన్యం ఆరబోసుకునేందుకు స్థలం కేటాయించాలి'
SRCL: రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు మూడు ఎకరాల స్థలం కేటాయించాలని సిరిసిల్ల పరిధిలోని రగుడు గ్రామస్థుల కోరారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం ఆరబోయడానికి స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు చొరవ తీసుకుని అనుకూలంగా స్పందించాలని కోరారు.