'ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'
NRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని డీఎస్పీ లింగయ్య అన్నారు. నారాయణపేట పట్టణంలోని పలు కూడళ్ళలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు, వాహనదారులకు రోడ్డు బద్రత నియమాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడరాదని, వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ వాడాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు.