బైక్, లారీ ఢీ..ఇద్దరికీ స్వల్ప గాయాలు
KMM: బైక్, లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలైన ఘటన సత్తుపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాత బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని పసిగట్టి ఇద్దరు యువకులు చాకచక్యంగా పక్కకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పి, స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.