గంజా అంటే.. ప్రకాశంలో చుక్కలే.!

ప్రకాశం: జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. గతంలో ఒంగోలు గంజాయికి అడ్డా అనే పేరు ప్రాచుర్యంలో ఉండేది. ఏ మేరకు వాస్తవం ఉందో కానీ, ఎస్పీ దామోదర్ సారథ్యంలో గంజా మాఫియా తాట తీస్తున్నారని ఒంగోలు ప్రజల మాట. ఆకస్మిక తనిఖీలతో పోలీసులు రంగంలోకి దిగుతుండగా, గంజా బ్యాచ్ ఊహించని స్థితిలో పట్టుబడుతోంది.