'గోదావరి మహా హారతి విజయవంతం చేయండి'
JGL: దక్షిణ కాశి ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నదీ తీరాన ఈ నెల 9న నిర్వహించే గోదావరి మహా హారతి విజయవంతం చేయాలని గోదావరి హారతి రాష్ట్ర కోకన్వీనర్ దామెరరాం సుధాకర్ రావు అన్నారు. ధర్మపురిలో నవంబర్ 9న నిర్వహించే గోదావరి మహా హారతి వాల్ పోస్టర్‌ను గురువారం గోదావరి హారతి ఉత్సవ సమితి సభ్యులు ఆవిష్కరించారు.